హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామప్పను సందర్శించిన జర్మనీ దేశస్థురాలు

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని బుధవారం జర్మనీ దేశస్థురాలు మోనికా సందర్శించారు. ఆలయ అర్చకులు హరిశ్‌శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేష్ రామప్ప చరిత్ర, శిల్పకళా వైభవాన్ని వివరించారు. ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్‌తో పాటు టూరిజం పోలీస్, దేవాదాయశాఖ సిబ్బంది ఉన్నారు.