ADB: మహారాష్ట్రలోని కేలాపూర్‌కు చెందిన డగరె సంజయ్ తన ద్విచక్రవాహనానికి తెలంగాణ నంబరు ప్లేటు తప్పుగా అమర్చి తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నట్లు వన్ టౌన్ CI సునిల్ కుమార్ బుధవారం తెలిపారు. వాహన తనిఖీల్లో ఈ విషయం బయటపడటంతో నిందితుడిని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
తెలంగాణ
తప్పుడు నంబర్ ప్లేట్‌తో బైక్ నడుపుతూ వ్యక్తి అరెస్ట్


