హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక వేడుకలకు పకడ్బందీ భద్రత: ఎస్సై

WGL: వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టామని నల్లబెల్లి ఎస్సై సాయి ప్రసన్న కుమార్ తెలిపారు. మండల పరిధిలో గణేష్ మండపాల నిర్వాహకులు వివరాలను తెలంగాణ పోలీస్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటిస్తూ, భద్రతకు సహకరించాలని కోరారు.