హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్త్రీ నిధి రుణాల రికవరీ పెంచాలి: కలెక్టర్

PDPL: జిల్లాలో స్త్రీ నిధి రుణాల రికవరీ 90 శాతం పెంచాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం ఆయన ఐడీఓసీలో స్త్రీనిధి జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. అర్హులైన వారికి 100% రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. సుస్థిర జీవనోపాదుల ఏర్పాటుకు స్త్రీ నిధిని సక్రమంగా వినియోగించాలని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే వివోఏలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.