హైదరాబాద్: 28°C
తెలంగాణ

తరచూ విద్యుత్ కోతలు.. ప్రజల అవస్థలు

SDPT: హుస్నాబాద్‌ పందిళ్ల ఫీడర్‌ పరిధిలో తరచూ విద్యుత్‌ సరఫరా అంతరాయం ఏర్పడుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు లేక పంటలను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్న రైతులకు విద్యుత్‌ కోతలు మరింత సమస్యగా మారాయి. వ్యవసాయ బావులపై ఆధారపడి పంటలకు నీరందించాల్సిన సమయంలో తరచూ కరెంట్‌ పోతుందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.