MNCL: చెన్నూరు పట్టణంలో మతి స్థిమితం లేని అనాథ మహిళ శవాన్ని పోలీసులు ఖననం చేసి మానవత్వం చాటుకున్నారు. ఈనెల 7న రాత్రి గుర్తుతెలియని, మతిస్థిమితం లేని సుమారు 40 సం.ల వయస్సు గల మహిళ చెన్నూరు బస్టాండ్ సమీపంలో మృతి చెందింది. సమాచారం అందుకున్న సీఐ బన్సీలాల్, పోలీస్ సిబ్బందితో పంచనామా నిర్వహించి మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఖననం చేయించారు. ఈ సందర్భంగా పోలీసులను సీఐ అభినందించారు.
తెలంగాణ
అనాథ మహిళకు పోలీసుల అంత్యక్రియలు


