MHBD: గార్ల మండలంలోని సీతంపేటలో గుడుంబా స్థావరాలపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. సీఐ రవీందర్ ఆధ్వర్యంలో చేపట్టిన దాడుల్లో 20 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, 300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. గుడుంబా తయారీకి పాల్పడిన ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. అనుమతి పత్రాలు లేని ఐదు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు


