హైదరాబాద్: 28°C
క్రీడలు

నేడు భారత్-బంగ్లాదేశ్ సెమీఫైనల్ మ్యాచ్

మహిళల ఆసియా కప్‌ సెమీఫైనల్లో భారత్‌–బంగ్లాదేశ్‌ తలపడనున్నాయి. గ్రూప్‌ దశలో 3 విజయాలతో జోరుమీదున్న హర్మన్‌ప్రీత్‌ సేనకు బంగ్లాను ఎదుర్కోవడం పెద్ద సవాల్‌ కాదని భావిస్తున్నారు. స్మృతి మంధాన, షెఫాలీ, హర్మన్‌ప్రీత్‌ బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌ భారత్‌కు బలంగా ఉన్నాయి. రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.