హైదరాబాద్: 28°C
క్రీడలు

వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్‌లో శీతల్ దేవికి స్వర్ణం

ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌ స్టేజ్-3 టోర్నీ చివరి రోజు భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలు సాధించింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో శీతల్ దేవి స్వర్తం కైవసం చేసుకుంది. కజికిస్థాన్‌కు చెందిన ఐజాదా సీడన్‌తో జరిగిన ఫైనల్ 144-144తో టై అయింది. షూట్-ఆఫ్‌లో 10-9 తేడాతో విజయం సాధించి శీతల్ తన కెరీర్‌లో తొలి వ్యక్తిగత టైటిల్‌ను సొంతం చేసుకుంది.