JN: అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న రేషన్ దొడ్డు బియ్యం సకాలంలో వేలం నిర్వహించకపోవడంతో ముక్కిపోయి పురుగులపాలైంది. వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న దాదాపు 800 క్వింటాళ్ల బియ్యాన్ని స్టేషన్ ఘన్‌పూర్‌లోని గిడ్డంగిలో అధికారులు నిల్వ చేశారు. సకాలంలో వేలం నిర్వహించకపోవడంతో బియ్యం పూర్తిగా వినియోగానికి పనికిరాకుండా పోయింది.
తెలంగాణ
పురుగులపాలైన 800 క్వింటాళ్ల రేషన్ బియ్యం


