హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఆక్రమణల తొలగింపు..!

JN: జనగామ పట్టణంలో రోడ్లు, కాల్వలను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. కమిషనర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ రోడ్డులో రహదారిని ఆక్రమించి నిర్మించిన ఇనుప మెట్లు, జనరేటర్, విద్యుత్ నియంత్రికలను జేసీబీతో తొలగించారు. మరో రెండు ప్రాంతాల్లో మెట్లు, కాల్వలపై అనధికార నిర్మాణాలను తొలగించారు.