BDK: కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబరిచి, నేరస్తులకు శిక్ష పడేలా సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి బుధవారం SP రోహిత్ రాజు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఇదే స్ఫూర్తితో విధుల్లో మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పోలీసుల సేవలకు ఎస్పీ ప్రశంస


