హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 11న తొలి కార్మిక సౌలభ్య కేంద్రం ప్రారంభం

ADB: ఆదిలాబాద్‌లో సెప్టెంబర్ 11న తొలి కార్మిక సౌలభ్య కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి జీ. వివేక్ వెంకటస్వామి ప్రారంభించనున్నారని జిల్లా అధికారులు బుధవారం తెలిపారు. కార్మికుల సంక్షేమం, హక్కులు, ప్రభుత్వ పథకాలను సులభంగా అందించే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. R&B గెస్ట్ హౌస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.