హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు రైతులకు యూరియా పంపిణీ

MDK: రామాయంపేట మండల రైతులకు గురువారం యూరియా అందుబాటులో ఉండనుందని వ్యవసాయాధికారి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ఉదయం 8:30 గంటల నుంచి రైతులు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఎరువుల కొరత రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, రైతులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.