హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోలు: కలెక్టర్

NLG: రాబోయే ఖరీఫ్ 2026-27 సీజన్ ధాన్యం సేకరణను రైతులకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.