హైదరాబాద్: 28°C
వ్యాపారం

బ్యారెల్‌కు 100 డాలర్లు దాటిన చమురు ధరలు

పశ్చిమాసియాలో ఇరాన్, USల మధ్య పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటగా, భారత క్రూడ్ బాస్కెట్ ధర 109 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం మన చమురు సంస్థలు లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.23 చొప్పున మార్కెటింగ్ నష్టాలను భరిస్తున్నాయి.