WNP: కొత్తపేట మండలం కానాయపల్లి కోటిలింగేశ్వర దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాస శివరాత్రి సందర్భంగా ప్రదోషకాలంలో ధ్యాన మందిరంలోని స్వర్ణ కవచ పంచలోహ శివలింగానికి భక్తులు ఆవుపాలతో క్షీరాభిషేకం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని స్వహస్తాలతో అభిషేకం చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ
VIDEO: కోటిలింగేశ్వర దేవస్థానంలో శివలింగానికి క్షీరాభిషేకం


