హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

WNP: కొత్తకోట మండలం రామంతపూర్‌కు చెందిన ఆంజనేయులు ఈనెల 5న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గ్రామం నుంచి కొత్తకోట వస్తుండగా పాలెం శివారులో బైక్ అదుపుతప్పి తలకు తీవ్ర గాయమైంది. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. భార్య మనీషా ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు.