KMR: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని కామారెడ్డి డీఎంహెచ్‌ఓ డాక్టర్ జె. వెంకటి తెలిపారు. బుధవారం సాయంత్రం ఐడీఓసీలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. మాతా శిశు ఆరోగ్యం, టీకాలు, క్షయ నిర్మూలన, బీపీ-షుగర్ వ్యాధుల స్క్రీనింగ్ వేగవంతం చేయాలని ఆదేశించారు. వివరాలను ఆన్‌లైన్‌లో ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు.
తెలంగాణ
'ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి'


