హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి'

KMR: ఈనెల 27వ తేదీన జిల్లాలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. పర్యాటక రంగ అభివృద్ధికి, జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించి, వివిధ శాఖల సమన్వయంతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సూచించారు.