NGKL: తాడూర్ మండలం బాలన్‌పల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం పిచ్చికుక్క కలకలం సృష్టించింది. ఒకేసారి ఆరుగురిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్థులు వారిని నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిచ్చికుక్కల భయం నుంచి గ్రామానికి ముప్పు తప్పించేందుకు అధికారులు వెంటనే స్పందించి కుక్కను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
పిచ్చికుక్క దాడిలో ఆరుగురికి గాయాలు


