హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లోక్‌అదాలత్‌తో కేసులకు సత్వర పరిష్కారం'

KNR: ఈనెల 12న జరిగే జాతీయ లోక్‌అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చిగురు మామిడి ఎస్సై జగదీశ్వర్‌ కోరారు. కోర్టుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు వృథా చేసుకోకుండా రాజీ మార్గంలో వివాదాలను పరిష్కరించుకోవచ్చన్నారు. కుటుంబ కలహాలు, పాత కేసులు, రోడ్డు ప్రమాదాలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, కొట్లాటలు, పేకాట, ఎక్సైజ్‌, దొంగతనం తదితర కేసులకు పరిష్కారం లభిస్తుందన్నారు.