హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు

NGKL: ఊర్కొండపేట-జకీనాలపల్లి రోడ్డులోని మీది బావి వద్ద బుధవారం రాత్రి కారు బోల్తా పడింది. జడ్చర్ల నుంచి జకీనాలపల్లికి వస్తున్న తల్లి, కొడుకు హలీమా, జీలానిలకు తీవ్రగాయాలయ్యాయి. వర్షాలకు రోడ్డు కోతకు గురికావడం, మూలమలుపు ఉండటంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.