హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GDWL: విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా నేడు గద్వాల పట్టణంలో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ శివకుమార్ తెలిపారు. దౌదరపల్లి, పిల్లిగుండ్ల, రాఘవేంద్ర కాలనీ, రాయచూర్ రోడ్డు, బీసీ కాలనీ, మెడికల్ కాలేజ్ ఏరియాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు.