హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యక్తి దారుణ హత్య

MBNR: కౌకుంట్ల మండలం పుట్టపల్లిలో బీచుపల్లి ఉత్తన్న(55) హత్యకు గురికావడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న సీఐ రామకృష్ణ, SI భాస్కర్‌రెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉత్తన్న మద్యం సేవించి తరచూ గొడవలకు దిగేవాడని స్థానికులు తెలిపారు. అదే వివాదం హత్యకు దారితీసిందా మరేదైనా కారణమా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.