హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో రేపు మేగా జాబ్ మేళా

NZB: శివాజీ నగర్‌లోని ఉపాధి కల్పన శాఖ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి వేల్పుల విజేత తెలిపారు. ప్రైవేటు కంపెనీలో పని చేసేందుకు ఫార్మసిస్ట్ కోసం డీ ఫార్మసీ, బీ ఫార్మసీ పూర్తి చేసిన వారు, అలాగే ఫార్మసీ ఎయిడ్ కోసం ఇంటర్మీడియట్ పూర్తి చేసినవారు అర్హులన్నారు. రేపు ఉ.10 గంటల నుంచి 4 గంటల వరకు మేళా నిర్వహిస్తామన్నారు.