హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైనేజీ ఏర్పాటుకు పరిశీలన

ASR: జీకేవీధి మండలం దొడ్డికొండలో డ్రైనేజీ ఏర్పాటు చేయాలని పీజీఆర్ఎస్‌లో పెసా కార్యదర్శి చంటిబాబు సమర్పించిన అర్జీపై అధికారులు స్పందించారు. బుధవారం ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ, ప్రత్యేక అధికారి కళ్యాణ్‌రావు గ్రామాన్ని సందర్శించారు. డ్రైనేజీ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు. తొలుత కాలువలు తీయించి, అనంతరం సీసీ నిర్మాణంతో పకడ్బందీగా డ్రైనేజీ ఏర్పాటు చేస్తామన్నారు.