కృష్ణా: గుడివాడ మండలం మల్లాయిపాలెంలో ఎస్సై చంటిబాబు బుధవారం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీలు చేపట్టి, వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులు, వాహన ధ్రువపత్రాలు, ఆయన పరిశీలించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, రహదారి ప్రమాదాల నివారణ లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ చేపట్టామన్నారు.
ఆంధ్రప్రదేశ్
వాహనాలను తనిఖీ చేసిన ఎస్సై


