హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరంలో 'నిజం గెలిచింది' కార్యక్రమం

VZM: జిల్లా టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు బుధవారం నిరసన తెలిపారు. 2023 సెప్టెంబర్ 9న నాటి వైసీపీ ప్రభుత్వం ఆయనను అక్రమంగా అరెస్టు చేసి, 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించిన ఆ చీకటి రోజును గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు కొవ్వొత్తులు వెలిగించి 'నిజం గెలిచింది' అంటూ నినాదాలు చేశారు.