హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంటల్లో చిక్కుకున్న వృద్ధురాలు.. ఎంజీఎంకు తరలింపు

WGL: గీసుకొండ మండలం వసంతపురం గ్రామంలో బుధవారం వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు కట్టెల పొయ్యి మంటలు చీరకు అంటుకోవడంతో బలభద్ర కళమ్మ అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సకాలంలో స్పందించి మంటలను ఆర్పడంతో ప్రాణాపాయం తప్పింది. ముఖం, ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. ఆమెను 108వాహనంలో ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.