ADB: మావల పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం రాత్రి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, పెండింగ్ కేసులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాత్రి గస్తీ పెంచి ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. కోర్టుల్లో నేరస్థులకు శిక్ష పడేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలని తెలిపారు.
తెలంగాణ
మావల పీఎస్‌ను తనిఖీ చేసిన SP అఖిల్ మహాజన్


