హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు విజ్ఞాన కేంద్రానికి భూమి పూజ

NRPT: నారాయణపేట మండలం లింగంపల్లి శివారులో రైతు విజ్ఞాన కేంద్రానికి జిల్లా కలెక్టర్ ప్రియాంక, సర్పంచ్ భాగ్యతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, ఉద్యాన పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.