RR: మియాపూర్‌లోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ కేబిన్ మొదటి అంతస్తులో ఉండగా సాంకేతిక లోపంతో నాలుగో అంతస్తు తలుపులు తెరుచుకున్నాయి. కేబిన్ ఉందని భావించి లోపలికి అడుగుపెట్టిన 23 ఏళ్ల విజయ్ బాబు లిఫ్ట్ గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తెలంగాణ
లిఫ్ట్ గుంతలో పడి యువకుడి మృతి


