కృష్ణా: అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయమని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. పెనమలూరు (M) పోరంకిలోని TDP ఆఫీసులో 66 మంది బాధితులకు రూ.37 లక్షల CMRF చెక్కులను ఆయన బుధవారం అందజేశారు. అత్యవసర వైద్య చికిత్సలకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి CMRF ద్వారా త్వరితగతిన సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత


