ప్రకాశం: కనిగిరి పట్టణంలో విద్యుత్ టవర్ వర్క్స్ కారణంగా గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ప్రధానంగా మున్సిపల్ పరిధిలోని కనకపట్నం, కేసిరెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కనిగిరిలో విద్యుత్ సరఫరా నిలిపివేత


