హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంచాలి'

HYD: ఉద్యోగ నోటిఫికేషన్ల జాప్యం కారణంగా వయోపరిమితి దాటిన నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ సీఎం రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిసి కోరారు. కానిస్టేబుల్ వయోపరిమితిని 34 నుంచి 36 ఏళ్లకు, ఎస్‌ఐ వయోపరిమితిని 37 నుంచి 38 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.