హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మినీ కాఫీ క్యూరింగ్ వర్క్స్ పరిశీలించిన జేసీ

ASR: ఆర్‌వీ నగర్‌లోని ప్రాంతీయ కాఫీ పరిశోధనా సంస్థ 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకల ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం జాయింట్ కలెక్టర్ శ్రీపూజ చింతపల్లిలోని మినీ కాఫీ క్యూరింగ్ వర్క్స్‌ను సందర్శించారు. వేదిక, మౌలిక వసతులు, వీఐపీ, వీవీఐపీ పర్యటనలు, పార్కింగ్ తదితర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.