కోనసీమ: మలికిపురం మండలం దిండి-చించినాడ బ్రిడ్జిపై నుంచి బుధవారం ఓ వ్యక్తి గోదావరిలోకి దూకిన విషయం తెలిసిందే. అతను దిండి గ్రామానికి చెందిన దేవ వికాస్‌గా పోలీసులు గుర్తించారు. అతనికి వారం క్రితమే వివాహం అయినట్లుగా తెలిపారు. ఇంటి నుంచి నడుచుకుంటూ బ్రిడ్జి పైకి వచ్చిన వికాస్ అక్కడ సెల్ ఫోన్, చెప్పులు వదిలి గోదావరిలోకి దూకాడు. అతని ఆచూకీ ఇంకా లభించలేదు.
ఆంధ్రప్రదేశ్
పెళ్లైన వారానికే గోదావరిలోకి దూకిన యువకుడు..!


