SRD: న్యాల్కల్ మండలం కస్తూర్బా విద్యాలయం ప్రత్యేక అధికారిగా లలిత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గత కొంతకాలం నుంచి ఇక్కడ ఇన్చార్జ్ వ్యవస్థ కొనసాగుతోంది. అయితే ఈమెను ప్రిన్సిపాల్ (SO)గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో బాధ్యతలు వహించారు. బాలికల నాణ్యమైన విద్యాభ్యాసం అందించి, మంచి ఫలితాలు సాధించేందుకు టీచర్లతో కలిసి కృషి చేస్తామన్నారు.
తెలంగాణ
కస్తూర్బా విద్యాలయం ప్రత్యేక అధికారిగా లలిత బాధ్యతలు


