VKB: గాజీపూర్‌లో గ్రామకంఠం భూమి ఆక్రమణకు గురైందని గ్రామస్థులు ఆరోపించారు. హనుమాన్ మందిరం వెనుక ఉన్న 10 గుంటల స్థలాన్ని సర్వే చేసి, హద్దులు నిర్ణయించాలని కోరుతూ తహశీల్దార్ వెంకటేష్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఆక్రమణ ఉన్నట్లు తేలితే వెంటనే తొలగించాలని కోరారు. మహిళా సమైక్య భవనాన్ని శిఖం భూమిలో కాకుండా గ్రామకంఠం స్థలంలోనే నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
గ్రామకంఠం భూమి ఆక్రమణపై ఆరోపణలు


