SS: మైనింగ్ అధికారులు ముదిగుబ్బ మండలం పట్నం వద్ద బిల్లులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన వాహనాలను తదుపరి చర్యల నిమిత్తం పట్నం ఎస్‌హెచ్‌వోకు అప్పగించారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఏడీ మైన్స్ అమీర్ బాషా, సునీతా బాయి, సర్వేయర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 టిప్పర్ల సీజ్


