హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాటర్ సప్లై పథకానికి శిలాఫలకం ఆవిష్కరణ

ప్రకాశం: చీమకుర్తి మున్సిపాలిటీ వాటర్ సప్లై పథకానికి బుధవారం MLA బీఎన్ విజయకుమార్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రూ.87.61 కోట్ల నిధులతో పాటు అమృత్ 2.0 పథకం కింద రూ.3.07 కోట్లతో ఈ పథకాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ పథకం పూర్తయితే చీమకుర్తి పట్టణంలో చిరకాలంగా నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు