హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు

TPT: నగర మున్సిపల్ కార్పొరేషన్‌కు అందించనున్న మొత్తం రూ.49 కోట్ల ఆర్థిక సహాయంలో భాగంగా రెండో విడతగా రూ.7.56 కోట్లను విడుదల చేసేందుకు టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. పనుల పురోగతి, యుటిలిటీ సర్టిఫికెట్ల ఆధారంగా మిగిలిన నిధులను విడతల వారీగా విడుదల చేయనున్నారు. ఈ నిధులతో నగరంలో భక్తులు, నివాసితులకు అవసరమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.