హైదరాబాద్: 28°C
తెలంగాణ

చదువుతో పాటు క్రమశిక్షణ అవసరం: SI

SRPT: పాలకీడు మండలం భవానిపురంలోని డీసీఎల్ పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రువ్వ కోటేశ్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, బాధ్యత, మంచి అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. డిజిటల్ మోసాలు, డ్రగ్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని, విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హెచ్చరించారు.