హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టు టీ బంకు తొలగింపుపై ఆగ్రహం

కడప నగరంలో జర్నలిస్టు టీ బంకును అధికారులు తొలగించడంపై ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డీ.ఎం. ఓబులేసు యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రేడ్ లైసెన్స్ ఉన్నప్పటికీ ముందస్తు సమాచారం, నోటీసు ఇవ్వకుండా బంకు రేకులు తొలగించడం సమంజసం కాదన్నారు. బాధిత జర్నలిస్టుకు న్యాయం చేయాలని, లేకపోతే కార్పొరేషన్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.