హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధికి నిధులు కోరిన ఎమ్మెల్యే

NZB: నిజామాబాద్ నగర అభివృద్ధికి రూ.200 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అసెంబ్లీలో సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఔటర్ రింగ్‌రోడ్లు, మాస్టర్‌ప్లాన్ అమలు, స్టేడియాల ఆధునికీకరణ, నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.