హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాలో కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే'

ASR: జిల్లాలో ఈనెల 11నుంచి 24వరకు ఇంటింటి కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ తెలిపారు. బుధవారం సర్వే పోస్టర్లు, బ్యానర్లను ఆవిష్కరించారు. ఆశా కార్యకర్తలు, పురుష ఆరోగ్య కార్యకర్తలు బృందాలుగా ప్రతి ఇంటినీ సందర్శించి, అనుమానితులను గుర్తిస్తారని చెప్పారు. స్పర్శ తెలియని మచ్చలు ఉంటే సర్వే బృందానికి తెలియజేయాలని సూచించారు.