VZM: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు బుధవారం విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది ఉద్యోగులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు రెండు గంటలుగా ఉన్నతాధికారుల కోసం నిరీక్షించారు. అధికారులు స్పందించకపోవడంతో కలెక్టర్ పోడియం వద్ద బైఠాయించారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన ఉద్యోగులు


