అన్నమయ్య: రాజంపేట పాత బస్టాండ్‌లో పట్టణ సీఐ నాగార్జున ఆధ్వర్యంలో పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై నేరాలు, దొంగతనాలు, ఏటీఎం మోసాల నివారణపై సూచనలు చేశారు. ఏటీఎం పిన్, ఓటీపీని ఇతరులతో పంచుకోవద్దని, అపరిచితుల సహాయం తీసుకోవద్దని తెలిపారు. బాల్య వివాహాల నివారణ, వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించడంపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
రాజంపేటలో ప్రజలకు అవగాహన కార్యక్రమం


