హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాము కాటుకు రైతు బలి

KMM: పాము కాటుకు గురై రైతు మృతి చెందిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన తుడుం నాగయ్య(45) పొలంలో మందు స్ప్రే చేస్తుండగా పాము కాటు వేసింది. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆయన్ని చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.